పేదలకు ఇళ్లస్థలాలు ఇస్తామని చెప్పి తిరిగి పేదలనుంచే భూములను అక్రమంగా తీసుకుంటున్నారని తెదేపా ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీశ్వరావు ఆరోపించారు. విశాఖ జిల్లాలోని అనకాపల్లిలో ఆయన కార్యకర్తలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పింఛన్ల తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హత కలిగిన పేదలకు పింఛను ఆపడం దారుణమన్నారు. 15రోజుల్లోగా లబ్ధిదారులకు పింఛను అందించకపోతే పార్టీ తరుపున పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు.
ఇదీ చూడండి పొగమంచుతో విమానాల రాకపోకలకు అంతరాయం