శాసనమండలిలో వైకాపా మంత్రులు దౌర్జన్యంగా ప్రవర్తించారని తెదేపా ఎమ్మెల్సీ బుద్దా నాగజగదీశ్వరరావు విమర్శించారు. విశాఖలో మాట్లాడుతూ.. మండలిలో తీవ్ర పరిణామాలు జరిగాయన్నారు. ద్రవ్య వినిమయ బిల్లును తెదేపా ఆపేసిందంటూ వైకాపా సభ్యులు దుష్ర్పచారం చేస్తున్నారన్నారు.
మనీ బిల్లు పాస్ చేయడానికి తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రయత్నించిందని.. అధికార పక్షం అందుకు సహకరించలేదని తెలిపారు. మంత్రులు అనిల్ కుమార్, వెల్లంపల్లి శ్రీనివాస్‌లు దారుణంగా మాట్లాడరని చెప్పారు. అనిల్ తనపై దాడికి ప్రయత్నించారని వెల్లడించారు.
ఇవీ చదవండి...