ఎమ్ఎమ్సీ బిల్లుకు వ్యతిరేకంగా విశాఖలో జూనియర్ డాక్టర్లు చేస్తున్న ధర్నాకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. కేజీహెచ్ వద్ద జూడాలు, డాక్టర్లు చేస్తున్న నిరసనకు ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేశ్ కుమార్, గణబాబు, వెలగపూడి రామకృష్ణ సంఘీభావం ప్రకటించారు. వైద్యులు చెబుతున్న న్యాయపరమైన అభ్యంతరాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. తిరుపతి, విజయవాడలో జూడాలతో పోలీసుల తీరు అమానుషమనీ, ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం వైద్య విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి : మెడికో గల్లా పట్టిన పోలీసు.. విజయవాడలో ఉద్రిక్తత