ఎన్నో ఏళ్లుగా రైతులు సాగు చేసుకుంటున్న భూములను ప్రభుత్వం దౌర్జన్యంగా స్వాధీనం చేసుకుందని మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు ఆరోపించారు. రైతులకు న్యాయం చేసి, అర్హులైన పేదలకు ప్రభుత్వమే భూములు కొనుగోలు చేసి ఇళ్ల స్థలాలను పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా చీడికాడ మండలం జి.కొత్తపల్లి వద్ద ప్రభుత్వం గుర్తించిన ఇళ్ల స్థలాల ప్రాంతాన్ని రామానాయుడు పరిశీలించారు.
రైతులు, ఇళ్ల స్థలాల లబ్ధిదారులు, పేదలకు న్యాయం చేయాలని తెదేపా నేతలు ధర్నా నిర్వహించారు. రైతులకు ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇళ్ల స్థలాల కేటాయింపుల్లో వైకాపా ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతుందని రామానాయుడు ఆరోపించారు.
ఇదీ చదవండి : 'శ్రీదేవి అక్కా.. పేకాట గురించి మాట్లాడలేదని ప్రమాణం చేస్తారా?'