ETV Bharat / state

"అక్రమ రిజిస్ట్రేషన్​లను అరికట్టాల్సిందిపోయి... సర్కారే కొమ్ముకాస్తోంది" - విశాఖలో హయగ్రీవ భూముల రిజిస్ట్రేషన్ కుంభకోణం

Bandaru Satyanarayanamurthy on Hayagriva lands: హయగ్రీవ ప్రాజెక్ట్‌లో కలెక్టర్ అనుమతి లేకుండానే ప్రభుత్వ భూమి.. 57 మందికి రిజిస్ట్రేషన్​లు అయిపోయాయని తెదేపా నేత బండారు సత్యనారాయణమూర్తి ఆధారాలతో సహా ఆరోపించారు. ప్రభుత్వ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాటిని అరికట్టాల్సింది పోయి సర్కారే కొమ్ముకాస్తోందని మండిపడ్డారు. సీఎం జగన్‌ భార్య భారతి బెదిరించి హయగ్రీవ భూముల రిజిస్ట్రేషన్లు చేయించారన్నారు.

TDP leader Bandaru Satyanarayanamurthy
తెదేపా నేత బండారు సత్యనారాయణమూర్తి
author img

By

Published : Oct 21, 2022, 8:15 AM IST

తెదేపా నేత బండారు సత్యనారాయణమూర్తి

Bandaru Satyanarayanamurthy on Hayagriva lands: హయగ్రీవ ప్రాజెక్టులో కలెక్టర్ అనుమతి లేకుండా ప్రభుత్వ భూమి 57 మందికి రిజిస్ట్రేషన్​లు అయిపోయాయని తెదేపా నేత బండారు సత్యనారాయణమూర్తి డాక్యుమెంట్లను విడుదల చేశారు. ప్రభుత్వ భూమి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ప్రభుత్వం వాటిని నిరోధించాల్సిందిపోయి వారికి కొమ్ముకాస్తోందని ఆయన ఆరోపించారు. హయగ్రీవ కోసం ఒక జీవీఎంసీ కమిషనర్ బలైపోయారన్నారు. హయగ్రీవ భూముల అమ్మకాలకు స్వయంగా ముఖ్యమంత్రి సతీమణి భారతి బెదిరించే.. రిజిస్ట్రేషన్లు చేయించారన్నారు.

రాజకీయాల్లో వ్యాఖ్యలు చాలా సిగ్గుపడేలా ఉన్నాయని జగన్ అనడం విడ్డూరంగా ఉందని తెదేపా నేత బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. గతంలో కొడాలి నాని, రోజా, దాడిశెట్టి రాజా, జోగి రమేష్​లు వాడిన పదజాలం ఏంటని ప్రశ్నించారు. ఇద్దరు చెల్లెళ్లు రోడ్డుపైన తిరిగితే జగన్​ ఆనందిస్తూ.. బయట వారికి సుద్దులు చెబుతారా అని సీఎంని నిలదీశారు. సీబీఐ అధికారుల మీద కేసు పెట్టే ధైర్యం ఎలా వచ్చిందన్న ఆయన.. జగన్​ పాత్ర లేకపోతే ఇలా జరగదని, బాబాయ్ హత్య కేసు పక్క రాష్ట్రానికి బదిలీ చేయడం వల్ల రాష్ట్ర ప్రతిష్ఠ మంటగలిసిందన్నారు. కోడి కత్తి కేసులోనూ జగన్​ మాటలు అన్నీ డ్రామాలే అన్నవి సుస్పష్టమన్నారు.

ఇవీ చదవండి:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.