రాష్ట్రంలో వైకాపా రాక్షసపాలనకు స్థానిక సంస్థల ఎన్నికల ద్వారానే బుద్ధి చెప్పాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పిలుపునిచ్చారు. విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలంలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించారు. వైకాపా పాలనలో సామాన్యులకు, దేవాలయాలకు రక్షణ కరవైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరహా పాలన ప్రపంచంలో మరెక్కడా ఉండదని ఎద్దేవా చేశారు. అందుకే ఈ విధానాలకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.
గ్రామస్థాయిలో ప్రతి కార్యకర్త సైనికుడిలా పార్టీ కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆ తరువాత నాతవరం మండలం జిల్లేడుపూడి గ్రామానికి చెందిన పలువురు వైకాపా నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరందరికీ అయ్యన్నపాత్రుడు పార్టీ కండువాలు కప్పి తెదేపాలోకి ఆహ్వానించారు.
ఇదీ చదవండి: