ETV Bharat / state

Ayyanna Patrudu: 'ఆసరా పేరుతో సీఎం జగన్ మోసం చేస్తున్నారు' - tdp leader ayyanna patrudu latest updates

డ్వాక్రా మహిళలు జాతీయ బ్యాంకులలో ఉన్న ఖాతాలను స్దానిక సహకార బ్యాంకులలోకి మార్చి వాటిని హామీగా చూపి పెద్ద ఎత్తున రుణం తీసుకోవడానికి జగన్ రెడ్డి యత్నిస్తున్నారని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. ఆసరా పేరు మీద మహిళలను మోసం చేస్తున్న జగన్ రెడ్డి తీరును ఎండగడుతూ ఆయన వీడియో ను విడుదల చేశారు.

అయ్యన్నపాత్రుడు
అయ్యన్నపాత్రుడు
author img

By

Published : Oct 9, 2021, 7:23 PM IST

రాష్ట్రంలో డ్వాక్రా మహిళలు జాతీయ బ్యాంకులలో ఉన్న ఖాతాలను స్దానిక సహకార బ్యాంకులలోకి మార్చి వాటిని హామీగా చూపి పెద్ద ఎత్తున రుణం తీసుకోవడానికి జగన్ రెడ్డి యత్నిస్తున్నారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. ఆసరా పేరు మీద మహిళలను మోసం చేస్తున్న జగన్ రెడ్డి తీరును ఎండగడుతూ ఆయన వీడియోను విడుదల చేశారు. ఇది ఆసరా కాదని, మహిళలకు టోకరాగా అభివర్ణించారు.

రాష్ట్రంలో 98 లక్షల మంది ద్వాక్రా మహిళలు ఉంటే, ఆసరా మొదటి విడతగా 87 లక్షల మందికి ఇచ్చారని, ఇప్పుడు ఆసరా రెండో విడతలో కేవలం 76 లక్షల మందికి మాత్రమే ఇస్తున్నారని విమర్శించారు. మిగిలిన 11 లక్షల మంది మహిళలకు ఆసరా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఆసరాకు ఇచ్చిన డబ్బులు రాష్ట్ర ఖజానా నుంచి కాదని, ఎందుకంటే రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేవని, ఇవి కార్పొరేషన్ల నుంచి తీసుకున్నవేనన్నారు.

దీనివల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, కాపు, బ్రాహ్మణ కార్పొరేషన్లకు అన్యాయం జగడం లేదా అని ప్రశ్నించారు. దీనికి జగన్ రెడ్డి ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. ఇలా ఎన్నాళ్లు మోసం చేస్తారని, ఇంత నష్టం జరుగుతున్నా కార్పొరేషన్ల చైర్మన్లు ఎందుకు ప్రశ్నించడం లేదని, ఎమ్మెల్యేలు, మంత్రులు మాట్లాడే ధైర్యం లేకపోతే రాజీనామా చెయ్యాలన్నారు. జగన్ రెడ్డి పెద్ద మోసగాడని, డబ్బులు కోసం ఏమైనా చేయగల సమర్ధుడని, అందుకోసం మరో కొత్త పథకం రచిస్తున్నాడని విమర్శించారు.

ఇదీ చదవండి:

'ముందస్తు ప్రణాళికతోనే లఖింపుర్ ఘటన.. కేంద్ర మంత్రిదే కుట్ర'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.