Anita met the NAOB displaced fishermen's families: ఎన్ఏఓబీ (నావల్ ఆల్టర్నేటివ్ ఆపరేటింగ్ బేస్) నిర్మాణంతో ఎస్. రాయవరం మండలం మత్స్యకారుల జీవితాలు బుగ్గి పాలయ్యాయని టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. నిర్వాసితులకు ఇప్పటికీ న్యాయం జరగలేదని తెలిపారు. 2వేల మత్స్యకారుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. బంగారమ్మ పాలెం మత్స్యకారులకు ఫిషింగ్ హార్బోర్ నిర్మించి పక్కనే పునరావాస కాలనీ నిర్మించాలని డిమాండ్ చేశారు. ఫిషింగ్ హార్బర్ నిర్మాణం జరిపే వరకు శారదా వరాహ నదిలో చేపలు పట్టుకోవడానికి అనుమతినివ్వాలని అన్నారు.
బాధిత గ్రామ ప్రజల కోసం ఒక కేంద్రీయ విద్యాలయం కట్టాలని అనిత డిమాండ్ చేశారు. నిర్వాసితుల కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మించాలని అన్నారు. బంగారమ్మపాలెం నుంచి నేవీ గేట్ వరకు రాకపోకలకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మత్స్యకారుల సమస్యపై వైసీపీ ప్రజాప్రతినిధులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. కలెక్టర్, జిల్లా మంత్రులు ఈ విషయంపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. హెటిరో కెమికల్స్ వలన మత్స్య సంపద దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: