విశాఖ జిల్లా పెందుర్తి ఎమ్మెల్యే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి కోసం ఏం చేశారో చెప్పాలని తెదేపా నేత బండారు అప్పలనాయుడు ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి చేసిన పనులవల్లే ప్రజలు కనీస వైద్యం పొందుతున్నారని అన్నారు. తెదేపా హయంలో జరిగిన అభివృద్ధి తప్ప, వైకాపా నేతలు ఆసుపత్రికి కొత్తగా నిధులు కేటాయించిన దాఖలాలు లేవని విమర్శించారు. నియోజక వర్గానికి ఇప్పటివరకూ చేసిన పనుల గురించి ప్రస్తుత ఎమ్మెల్యే ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వాలు ప్రజల పక్షాన నిలబడి వారికి అవసరమైన సేవలు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: