'మా' ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేయవచ్చని నటుడు సుమన్ అన్నారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌లో నటిస్తున్నప్పుడు లేని స్థానిక సమస్య.. 'మా' ఎన్నికల్లో ఉండాలనుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. విశాఖ గాజువాకలో జరిగిన కరాటే ఛాంపియన్ షిప్ కార్యక్రమంలో సుమన్ పాల్గొన్నారు. చిత్ర పరిశ్రమలో ఎంతోమంది సీనియర్ ఆర్టిస్టులు.. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. అలాంటి వారిని ఆదుకునేలా 'మా' ఎన్నికల్లో గెలిచిన వారు కృషి చేయాలని చేయాలని సుమన్ సూచించారు. కష్టాల్లో ఉన్న సీనియర్ ఆర్టిస్టుల కోసం వృద్ధాశ్రమం కట్టాలని అన్నారు.
ఇదీ చదవండి: