విశాఖ జిల్లా చోడవరంలో జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించారు. పాఠశాల, కళాశాల విద్యార్థులతో రెవెన్యూ వర్గాలు పట్టణంలో ర్యాలీ జరిపారు. విద్యార్థులతో ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. ఈ ర్యాలీ జరిపి మానవహారంగా ఏర్పాడ్డారు. ఉషోదయ కళాశాలలో తహసీల్దార్ రవికుమార్ ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ మాట్లాడారు.
జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా తునిలో ర్యాలీ చేపట్టారు. తహసీల్దార్ శ్రీపల్లవి, పురపాలక కమిషనర్ ప్రసాద్ రాజు పాల్గొని.. విద్యార్థులతో కలిసి ప్రదర్శన నిర్వహించారు. ఓటు హక్కు పై అవగాహన కల్పించారు.
పశ్చిమగోదావరి జిల్లా
జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా దెందులూరులో ఓటుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తహసీల్దార్ ఆధ్వర్యంలో స్థానిక ఉన్నత పాఠశాల విద్యార్థులు ర్యాలీ చేపట్టారు.
కడప జిల్లా
జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా మైదుకూరు, జమ్మలమడుగులో విద్యార్థులతో కలిసి రెవెన్యూ అధికారులు ప్రదర్శన నిర్వహించారు. నియోజకవర్గ ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో విద్యార్థులు ఓటు హక్కుపై నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని అధికారులు పిలుపునిచ్చారు.
అనంతపురం జిల్లా
కదిరిలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పండగలా నిర్వహించారు. కదిరి శాసనసభ్యుడు సిద్ధారెడ్డి ర్యాలీని ప్రారంభించారు. బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యార్థులకు ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు. హిందూపురంలో విద్యార్థిని విద్యార్థులు తహసీల్దార్ కార్యాలయం నుంచి ప్రధాన కూడళ్లలో ర్యాలీ నిర్వహించి ఇందిరమ్మ సర్కిల్ వద్ద మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేశారు.
చిత్తూరు జిల్లా
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని... మండల రెవెన్యూ అధికారి సురేష్ బాబు అన్నారు. ఓటు హక్కుపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. చంద్రగిరి, తంబళ్లపల్లె, పీలేరులో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో తహసీల్దార్ చంద్రమోహన్ ఓటు హక్కుపై అవగాహన సదస్సు నిర్వహించారు.
కృష్ణాజిల్లా
ఓటర్లందరూ తమ ఓటుహక్కు తప్పనిసరిగా వినియోగించుకోవాలని నూజివీడు సబ్ కలెక్టర్ సూచించారు. కలెక్టర్ కార్యాలయం ఆవరణలో డాక్టర్ ఎంఆర్ అప్పారావు క్రిష్ణ క్యాంపస్ విద్యార్థులతో ఓటరు అవగాహన ర్యాలీని సబ్ కలెక్టర్ ప్రారంభించారు.
కర్నూలు జిల్లా
ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైందని కర్నూలు జిల్లా సంయుక్త కలెక్టర్ రవి పఠాన్ శెట్టి అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కర్నూలులో ర్యాలీ నిర్వహించారు.
ప్రకాశం జిల్లా
జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం, చీరాల, అద్దంకిలో అధికారులు, విద్యార్థులు , వివిధ పార్టీల నాయకులు, ప్రజలు కలసి ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో ప్రతీఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్లకార్డులు చేత బట్టి నినాదాలు చేశారు.
విజయనగరం జిల్లా
విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఓటరు దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఐటీడీఏ పీవో బీఆర్ అంబేడ్కర్ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. కొత్త ఓటరుగా నమోదు అయిన వారికి గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. సీనియర్ సిటిజన్లను ఘనంగా సత్కరించారు.
శ్రీకాకుళం జిల్లా
జాతీయ ఓటర్ల దినోత్సవం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఘనంగా జరిగింది. మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నరసన్నపేట ఎంపీడీవో కార్యాలయం నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
ఇదీ చదవండి: