ETV Bharat / state

ఉపకారవేతనం కోసం విద్యార్థుల ఆందోళన - పాడేరులో విద్యార్థుల ఆందోళన

పెండింగ్​లో ఉన్న ఉపకారవేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ విశాఖ జిల్లా పాడేరులో విద్యార్థులు ఎమ్మెల్యే ఇంటి ఎదుట బైఠాయించారు. ఉపకారవేతనం రాక తాము ఫీజులు చెల్లించలేదని, యాజమాన్యాలు తమకు పరీక్షలు రాసేందుకు హాల్​టికెట్ ఇవ్వడంలేదని ఆందోళన వ్యక్తంచేశారు.

students dharnaa for scholorship at paderu in vizag
ఎమ్మెల్యే ఇంటిముందు బైఠాయించిన విద్యార్థులు
author img

By

Published : Feb 28, 2020, 11:13 AM IST

పాడేరులో విద్యార్థుల ధర్నా

విశాఖ మన్యం పాడేరులో వివిధ జూనియర్ కళాశాల విద్యార్థులు ఉపకారవేతనం కోసం రోడ్డెక్కారు. విద్యాసంవత్సరం ముగుస్తున్నా.. ఇప్పటివరకూ డబ్బు మంజూరుచేయలేదన్నారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో ర్యాలీగా వెళ్లి పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఇంటి ఎదుట బైఠాయించారు. ఆమె స్పందించి విద్యార్థులతో మాట్లాడారు. పరీక్ష ఫీజు చెల్లించలేదని హాల్​టికెట్లు ఇవ్వడంలేదని విద్యార్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ప్రిన్సిపల్​తో తాను మాట్లాడతానని.. అందరూ పరీక్ష రాసేలా చూస్తానని ఎమ్మెల్యే హామీ ఇవ్వటంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.

ఇవీ చదవండి.. ఫ్లెక్సీలు కడుతూ విద్యుదాఘాతంతో ఇద్దరి మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.