'మద్యం వద్దు-కుటుంబం ముద్దు' అనే నినాదంతో విశాఖ బీచ్ రోడ్లో విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. గాంధీ సెంటర్, ఇండియా యూత్ ఫర్ బెటర్ సొసైటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ర్యాలీని ఆంధ్రప్రదేశ్ మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ లక్ష్మణరెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలో మద్యపానాన్ని నిర్మూలించడంలో భాగంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని లక్ష్మణ రెడ్డి తెలిపారు. బీచ్ రోడ్ కాళీమాత ఆలయం వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ వైయంసీఏ వరకూ కొనసాగింది. ఈ కార్యక్రమంలో గాంధీ సెంటర్ అధ్యక్షుడు ప్రొఫెసర్ బాల మోహన్ దాస్, ఎన్సీసీ విద్యార్థులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి...విద్యార్థులకు విలువలతో కూడిన విద్యాబోధన