ETV Bharat / state

30 ఎకరాల్లో రాష్ట్ర అతిథి గృహం..గ్రేహౌండ్స్​ కొండపై నిర్మాణం! - విశాఖ గ్రేహౌండ్స్​ కొండపై అతిథి గృహం న్యూస్

విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం కాపులుప్పాడలోని ‘గ్రేహౌండ్స్‌ కొండ’పై 30 ఎకరాల్లో ఏపీ రాష్ట్ర అతిథిగృహం (స్టేట్‌ గెస్ట్‌హౌస్‌) ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి.

30 ఎకరాల్లో రాష్ట్ర అతిథి గృహం..గ్రేహౌండ్స్​ కొండపై నిర్మాణం!

author img

By

Published : Aug 19, 2020, 6:25 AM IST

విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) పర్యవేక్షణలో సమగ్ర నిర్మాణ ఆకృతులు, ప్రాజెక్టు నిర్వహణ సేవలు అందించేందుకు ఆసక్తి ఉన్న సంస్థల నుంచి ప్రతిపాదనలు (ఆర్‌ఎఫ్‌పీ) ఆహ్వానించారు. దీనిపై ప్రీబిడ్‌ సమావేశం మంగళవారం జరిగింది. ఇందులో 8 మంది పాల్గొనగా, అధికారులు వారి సందేహాలు నివృత్తి చేశారు. ఈనెల 26వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోగా బిడ్స్‌ దాఖలుకు అవకాశం కల్పించారు. అదేరోజు సాయంత్రం సాంకేతిక ప్రతిపాదనలు స్వీకరించి, 28న వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా టెక్నికల్‌ ప్రజంటేషన్లు పరిశీలిస్తారు. 31న వీఎంఆర్‌డీఏ సమావేశ మందిరంలో అర్హులైన బిడ్డరును ఎంపికచేసి సెప్టెంబరు 2న ఆ సంస్థతో చర్చించి, 4వ తేదీన ఒప్పందంపై సంతకాలు చేసుకోనున్నారు. 7వ తేదీ నుంచి పనులు ప్రారంభించాలని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు.
వసతి లేనందున
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, ముఖ్యమంత్రి, కేంద్రమంత్రులు, ఇతర ప్రముఖులు రాష్ట్రానికి వచ్చినప్పుడు తగిన రక్షణ ప్రమాణాలతో కూడిన వసతి ఉండాలి. ప్రైవేటు హోటళ్లలో వసతి కల్పిస్తే ప్రోటోకాల్‌ ఖర్చు ఎక్కువవుతుందని గుర్తించిన ప్రభుత్వం.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కొత్త, అదనపు గదులు నిర్మించాలని నిర్ణయించింది. ఇందులోభాగంగానే విశాఖలో ‘స్టేట్‌ గెస్ట్‌హౌస్‌’ నిర్మిస్తున్నట్లు ఆర్‌ఎఫ్‌పీలో తెలిపారు. ఈ ప్రాంతం విశాఖ విమానాశ్రయం నుంచి 30 కి.మీ. దూరంలో ఉంది. నిర్మాణసంస్థ స్థలానికి సంబంధించిన బృహత్తర ప్రణాళిక, ఆర్కిటెక్చరల్‌, ఇంజినీరింగ్‌, ఇంటీరియర్‌ ఆకృతులు ఇవ్వాలి. నిర్మాణ, విద్యుత్‌, అగ్నిమాపక, హరితభవన నమూనాలు చూపాలి. ప్రణాళికలో భవన సముదాయాలు, పార్కింగ్‌, ఉద్యానవనాల ఆకృతులు, త్రీడీ విజువలైజేషన్స్‌ చేర్చాలి. ప్రాజెక్టు పూర్తయ్యేవరకూ ఆ సంస్థే పూర్తి పర్యవేక్షణ చేపట్టాలి.

ఇదీ చదవండి: రాష్ట్రంలో 3 లక్షలు దాటాయ్​.. కొత్తగా 9,652 కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.