ETV Bharat / state

యువ సంగీత కెరటం.. సుమన్‌ వంకర.. - యువ సంగీత దర్శకుడు సుమన్‌ వంకర పై ప్రత్యేక కథనం

పాఠశాలలో సరదాగా రాసిన పాట.. ఓ కుర్రాడిని రచన వైపు నడిపింది. స్నేహితులకు చేసే ప్రేమ సాయం.. తనను రచయితగా మార్చింది. అవకాశాల కోసం హైదరాబాద్‌లో కాలినడకన తిరిగిన అనుభవం.. సంగీత దర్శకుడిగా నిలదొక్కుకునేలా చేసింది. త్వరగా గుర్తింపు తెచ్చు కోవాలనే తపన.. ప్రేమగీతాల రచయితగా సమాజానికి పరిచయం చేసింది. కొత్తగా ప్రయత్నించిన 'బాలేవే పిల్లా'... భలే ఛాన్సుల్ని మోసుకొచ్చింది. 'సాఫ్ట్‌వేర్‌ డెవలపర్'‌తో నువ్వే నేనే అంటే... ప్రతి ఫోన్‌లో రింగ్‌టౌన్‌గా మారిపోయింది. ఈ ప్రయాణానికి కేరాఫ్‌ అడ్రస్‌...యువ సంగీత సంచలనం సుమన్‌ వంకర

web serices  music director suman vankara
యువ సంగీత కెరటం సుమన్‌ వంకర
author img

By

Published : Jan 8, 2021, 9:53 PM IST

ఇటీవల వచ్చిన వెబ్‌సిరీస్‌ల్లో 'సాఫ్ట్‌వేర్‌ డెవలపర్'‌ ఎంత హిట్‌ అయ్యిందో అందరికి తెలుసు. అందులో వచ్చే ప్రేమ, బ్రేకప్‌ సన్నివేశాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా నేపథ్య సంగీతం, నువ్వే నేనే పాట కుర్రకారు హృదయాల్ని కొల్లగొట్టింది. ఆ సంగీతం మాయ వెనక దాగి ఉన్న కుర్రాడు.... సుమన్‌ వంకర. ర్యాప్‌, పాప్‌, లవ్‌ అనే తేడా లేకుండా అన్ని రకాల బాణీలు రూపొందిస్తూ.. సామాజిక మాధ్యమాల్లో సంగీత సంచలనంగా మారాడు.

విశాఖ షీలానగర్‌కు చెందిన వంకర సుమన్‌.. ఉక్కు కార్మగారం ఉద్యోగి సత్య నారాణయణ, సత్యవేణిల కుమారుడు. సుమన్‌ 9వ తరగతి నుంచే పాటలు రాయడం మెుదలుపెట్టాడు. తరగతి గదిలో చివరి బెంచీల్లో కూర్చునే విద్యార్థులు ఎదుర్కొనే వివక్ష గురించి తొలి పాట రాసి ప్రశంసలు అందుకున్నాడు. ఆ ప్రోత్సాహంతోనే రచయితగా స్థిరపడాలనే కోరిక సుమన్‌కు కలిగింది.

తప్పని సినిమా కష్టాలు..

తల్లిదండ్రులకు నచ్చజెప్పి ఇంటర్‌ చదువుతున్న సమయంలోనే సినిమా అవకాశాల కోసం హైదరాబాద్‌ వెళ్లాడు. కానీ, అవకాశాలు లభించలేదు. ఇండస్ట్రీలో అవకాశాలు అంత సులువుగా లభించవని గ్రహించిన సుమన్‌... విశాఖకు తిరిగి వచ్చాడు. అయినప్పటికీ... పాటలు రాయడానికి ఏ మాత్రం దూరం కాలేదు. కసితో ఇంకా ఎక్కువగా రాయడం మెుదలుపెట్టాడు.

ప్రేమ గీతాలతో మెప్పించి..

రచనతో పాటు సంగీతం సమకూర్చి తొలిసారిగా 2012లో ప్రేమిక ఆల్బమ్‌ విడుదల చేశాడు .. సుమన్‌ వంకర. అలాగే, స్నేహితుల కోసం ప్రేమ గీతాలు రాసేవాడు. వాటికీ మంచి స్పందన లభించడంతో నగరవ్యాప్తంగా సుమన్‌తో పాటలు రాయించుకునే వారు పెరిగిపోయారు. ప్రేమించిన వారి పేరు, స్వభావం చెబితే చాలు... వారికి తప్ప మరొకరికి అంకితమవ్వలేని విధంగా పాటలు రూపొందిస్తున్నాడు.

ప్రేమగీతాలతో సామాజిక మాధ్యమాల్లో మంచి గుర్తింపు పొందిన సుమన్‌... 2016లో ఏంజెల్‌ సిరీస్‌ పేరుతో మరో ఆల్బమ్‌ విడుదల చేశాడు. అందులోని ‘బాలేవే పిల్లా...’ కుర్రకారుకు తెగ నచ్చేసింది. ఆ పాట యూట్యూబ్‌లో 30 లక్షల వీక్షణలు కొల్లగొట్టి.... సుమన్‌ వంకర కు మంచి బ్రేక్‌ ఇచ్చింది.

యువ సంగీత కెరటం సుమన్‌ వంకర

అంచెలంచెలుగా ఎదుగుతూ...

ఆ క్రమంలోనే.. యూట్యూబ్‌ సంచలనం సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ వెబ్‌సిరీస్‌కు అదిరిపోయే సంగీతం అందించాడు. ఆ సిరీస్‌ విజయం కావడంలో కీలక పాత్ర పోషించి.. మరింత గుర్తింపు పొందాడు … సుమన్‌ వంకర.

సొంతంగా స్టూడియో..

సినిమాల్లోనే స్థిరపడాలనే లక్ష్యంతో... సొంతంగా షీలానగర్‌ లో స్టూడియో ఏర్పాటు చేశాడు సుమన్. అలాగే, మదీనాబాగ్, ప్రేమ్‌నగర్‌-1 అనే రెండు వెబ్‌సిరీస్‌లను సైతం సొంతంగా నిర్మిస్తున్నాడు.

ప్రభాస్​ కోసం ఓ పాట..

రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ఫ్యాన్స్‌ కోసం సుమన్‌ రూపొందించిన పాట వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. సిక్స్‌ ఫీట్‌ చిన్నోడు... ఎంటర్‌ అవుతున్నాడు అనే పల్లవితో మెుదలయ్యే పాట సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఇదీ చదవండీ...ధర్మాన్ని పరిరక్షించాలేగాని, పరీక్షించకూడదు: శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.