విశాఖలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో మార్గశిరమాస పూజలు ఘనంగా నిర్వహించారు. మార్గశిర మాసం తొలి గురువారాన్ని పురస్కరించుకొని అమ్మవారిని ముత్యాల చీరతో ప్రత్యేకంగా అలంకరించారు. ఉదయం నుంచి కన్యకాపరమేశ్వరి అమ్మవారికి సహస్ర నామార్చన నిర్వహించారు. 200 మంది మహిళా భక్తులతో ఆలయ ప్రాంగణంలో ఉచిత సామూహిక కుంకుమార్చన జరిపించారు. ఈ మాసంలో ఒక్కో గురువారం ఒక్కో ప్రత్యేక అలంకరణతో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు.
ఇదీ చదవండీ: