ETV Bharat / state

వైభవంగా విశాఖ కనక మహాలక్ష్మీ అమ్మవారి మాసోత్సవం - కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు ప్రారంభం

ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అర్ధరాత్రి నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటున్నారు.

kankamahalakshmi ammavari masotsvalu starts
కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు ప్రారంభం
author img

By

Published : Nov 28, 2019, 8:20 AM IST

కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు ప్రారంభం
విశాఖవాసులు కొంగు బంగారం.. శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అర్ధరాత్రి 12 గంటల నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సతీసమేతంగా అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు. మార్గశిర మాసంలో అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. పసుపు నీళ్లతో అమ్మను అభిషేకించేందుకు భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. దూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకునేందుకు ప్రజలు తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.

ఇదీ చదవండి:

శ్రీవరాహలక్ష్మీ నృసింహస్వామి సన్నిధిలో పోలిపాడ్యమి

Intro:Ap_Vsp_91_28_KanakaMahalakshmi_Pojalu_Av_AP10083
కంట్రిబ్యూటర్: కె.కిరణ్
సెంటర్: విశాఖ సిటీ
8008013325
( ) ఉత్తరాంధ్ర ఇలావేల్పు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

Body:అమ్మవారికి ప్రీతికరమైన లక్ష్మివారం. మార్గశిర మాసంలో
ఇవాళ మొదటి లక్ష్మీ వారం అర్ధరాత్రి 12 గంటలకు పూజలు ప్రారంభమయ్యాయి. ఈ పూజల్లో స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సతీసమేతంగా విచ్చేసి అమ్మవారికి అభిషేకాలు చేశారు.

Conclusion:మార్గశిర మాసంలో అమ్మవారిని దర్శించుకుంటే సకల సుఖాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. సుదూర ప్రాంతాల నుంచే నెత్తిన పసుపు నీళ్ల బిందెలతో మహిళలు అమ్మవారిని అభిషేకించేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఈవో తెలిపారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.