విశాఖ జిల్లా నక్కపల్లి ఉపమాక వెంకటేశ్వరస్వామి దయతో.. పాయకరావుపేట ప్రజలు తనకు రాజకీయ అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు తెలిపారు. బెయిల్‌పై బయటకు వచ్చిన ఆయన ఉపమాక వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తాను రాజకీయాల కోసం అనేక త్యాగాలు చేశానన్నారు. తనకు మరోసారి అవకాశం కల్పించాలని కోరారు.
ఇదీ చదవండి: 'ఒక్క అవకాశం ఇచ్చినందుకే.. స్టీల్‌ప్లాంట్‌ను అమ్మేస్తున్నారు'