BACKWARDNESS OF UTTARANDHRA : ఉత్తరాంధ్ర వెనుకబాటును పోగొట్టేందుకు.. నిధులు, ఉద్యోగాలు అవసరమని ఉత్తరాంధ్ర చర్చా వేదిక కన్వీనర్.. కొణతాల రామకృష్ణ అన్నారు. విశాఖ దస్‌పల్లా హటల్‌లో.. ఉత్తరాంధ్ర వెనుకబాటుపై ప్రత్యేక చర్చ నిర్వహించారు. దీనికి వివిధ పార్టీల నేతలు, లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు.. జయప్రకాష్ నారాయణ హాజరయ్యారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా జనసేన పోరాటం చేస్తోందని ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. తమ పూర్తి మద్దతు కార్మిక సంఘాలకు ఉంటుందన్నారు. ఉత్తరాంధ్ర ఎంతగానో వెనుకబడిందని.. దానిని అభివృద్ధి చేయాల్సిన అవసరం అందరి పైన ఉందన్నారు. ఐటీ సదస్సులు.. ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ల వల్ల ఏం జరిగిందని ప్రశ్నించారు. ఐటీ కోసం వినియోగించే భవనాలను ప్రభుత్వ కార్యాలయాలుగా వాడుకుంటున్నారని మండిపడ్డారు.ఐటీని ఏ రకంగా అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి :