ఈ నెల 20 నుంచి 26 వరకు జరగబోయే గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఈసారి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గదుల విస్తీర్ణం బట్టి 12 నుంచి 20 మంది అభ్యర్థులను కూర్చోబెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం ఖాళీలు 1585 ఉండగా... లక్షా 50 వేల 441 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఖాళీలను బట్టి పరీక్ష రాసే అభ్యర్థులు సంఖ్యను పరిగణలోకి తీసుకుంటే ఒక పోస్ట్ కి సగటున 98 మంది పోటీపడుతున్నారు. ఇక ఇన్విజిలేటర్లను ఎంపిక చేసి అవసరమైన తర్ఫీదునిచ్చారు.
ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు, తిరిగి రెండు గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అభ్యర్థులు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాల్సి ఉందని అధికారులు స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరు విధిగా మాస్కు ధరించి కేంద్రాలకు రావాలని సూచిస్తున్నారు. కేంద్రాల్లో భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.
ఇవీ చూడండి...