విశాఖ కలెక్టరేట్లో స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలపై జాయింట్ కలెక్టర్ ఎల్. శివశంకర్ సమీక్ష నిర్వహించారు. ప్రతి సోమవారం స్పందనలో వచ్చిన అర్జీల పరిష్కారానికి మండల స్థాయిలో అధికారులు పని చేయాలని ఆదేశాలు ఇచ్చారు. మూడో శుక్రవారం ఉద్యోగ స్పందనలో ఉద్యోగులు ఇచ్చిన ఫిర్యాదులపై కూడా ఆయా శాఖలు దృష్టి పెట్టాలని విశాఖ జాయింట్ కలెక్టర్ ఎల్. శివశంకర్ ఆదేశాలు జారీ చేశారు. ఎన్ఐసి నుంచి వచ్చిన శాస్త్రవేత్త మూర్తి ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఒక వెబ్ సైట్ రూపొందించగా ఆ విషయాలను వివరించారు. జిల్లా వివరాలతో కూడిన పూర్తి సమగ్ర సమాచారంతో పోర్టల్‌ను మొదలు పెడుతున్నట్టు సమీక్షలో తెలపగా..పలువురు అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండీ:పాత చట్టాల రద్దు బిల్లుకు పార్లమెంటు ఆమోదం