ETV Bharat / state

ఆంధ్ర యూనివర్సిటీలో కట్టమంచి రామలింగారెడ్డి జయంతి

ఇసకపట్నంగా పిలిచే ఒక కుగ్రామంలో 1926లో విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసిన మహనీయుడు ఆయన. దేశంలోనే ఆ విశ్వవిద్యాలయం ఖ్యాతిని పెంచిన తొలి ఉపకులపతి... సర్.కట్టమంచి రామలింగారెడ్డి. ఆ విద్యాలయం పేరే ఆంధ్ర విశ్వవిద్యాలయం. ఆ పట్టణమే విశాఖపట్నం. నేడు రామలింగా రెడ్డి జయంతి. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం పరిపాలనా భవనం ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి ప్రస్తుత ఉపకులపతి ప్రసాదరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు.

sir kattamanchi ramalingareddy birth annaversary celebrations in andra university, visakhapatnam
ఆంధ్ర యూనివర్శిటిలో సర్​. కట్టమంటి రామలింగారెడ్డి జయంతి వేడుకలు
author img

By

Published : Dec 10, 2019, 3:36 PM IST

ఆంధ్ర యూనివర్సిటీలో కట్టమంచి రామలింగారెడ్డి జయంతి

విశాఖలో ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసిన మహనీయుడు... వర్సిటీ తొలి ఉపకులపతి సర్ కట్టమంచి రామలింగారెడ్డి జయంతి సందర్భంగా... ప్రస్తుత ఉపకులపతి పీవీజీడీ. ప్రసాద్ రెడ్డి ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రపంచ యుద్ధం సందర్భంగా గుంటూరులోని అమరావతికి తరలిపోయింది. 5 సంవత్సరాలు అక్కడే ఉంది.

తిరిగి విశాఖకు రప్పించేందుకు కట్టమంచి రామలింగారెడ్డి కృషి చేశారని ఉపకులపతి గుర్తుచేశారు. ఇటీవల దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు, ఐఐఎంలతో కలిపి 15 విద్యాలయాలకు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఎక్స్​లెన్స్ హోదా వచ్చిందని... అందులో ఆంధ్ర వర్సిటీ ఉందన్నారు. వీటిలో 10 సంస్థలకు ప్రభుత్వం హోదా ఇచ్చిందని... ఏయూకి కూడా ఆ హోదా వచ్చినట్లయితే వెయ్యి కోట్ల మేర నిధులు సమకూరుతాయని ఉపకులపతి వివరించారు.

ఇదీ చదవండీ:

విశాఖ టు విజయవాడ... వయా యువత..!

Intro:కిట్నం:879,విశాఖ సిటీ, ఎం.డి.అబ్దుల్లా.
ap_vsp_71_10_AU_VC_prasies_kattamanchi_services_AP10148

( ) ఇసకపట్నంగా గా పిలిచే ఒక కుగ్రామంలో 1926లో విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసి, దేశంలోనే ఆ విద్యాలయం ఖ్యాతిని పెంపొందించిన తొలి వైస్ ఉపకులపతి సర్ కట్టమంచి రామలింగారెడ్డి సేవలు శ్లాఘనీయం ఆని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉప కులపతి పీవీజీ డీ.ప్రసాద్ రెడ్డి అన్నారు. సర్ కట్టమంచి రామలింగారెడ్డి జయంతి సందర్భంగా విశ్వవిద్యాలయం పరిపాలనా భవనం ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి ప్రసాదరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు.

Body:ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రపంచ యుద్ధం సందర్భంగా గుంటూరులోని అమరావతి తరలిపోయి ఐదు సంవత్సరాలు అక్కడ ఉండటం, అనంతరం తిరిగి విశాఖపట్నం విశ్వవిద్యాలయాన్ని రప్పించేందుకు కూడా కట్టమంచి రామలింగా రెడ్డి కృషి చేశారని అన్నారు. కమిటీ దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు, ఐఐఎంలలో సహా 15 విద్యాలయాలకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్స్లెన్స్ హోదా కల్పించేందుకు గుర్తించిదని, ప్రస్తుతం ప్రభుత్వం పది విద్యాలయాలకు ఆ హోదా కల్పించిందని, మిగిలిన ఐదు విద్యాలయాలకు కూడా ఆహా హోదా వచ్చినట్లయితే ఆంధ్ర విశ్వవిద్యాలయానికి వెయ్యి కోట్ల మేర నిధులు సమకూరుతాయని ఉపకులపతి వివరించారు.

Conclusion:కార్యక్రమంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం,పూర్వ ఉపకులపతి బీల సత్యనారాయణ, వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు, ఆచార్యులు సిబ్బంది పాల్గొన్నారు.

బైట్: పి.వి.జి.డి.ప్రసాద రెడ్డి, ఉప కులపతి,ఆంధ్ర విశ్వవిద్యాలయం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.