విశాఖజిల్లా సింహాద్రి అప్పన్న సన్నిధిలో జరిగే దైవ కార్యక్రమాల వీడియోలు మార్ఫింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని దేవస్థానం ఈఓ సూర్యకళ తెలిపారు. ఇటీవలే కొందరు సింహాచలం శ్రీవరాహలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ప్రతిష్టకు భంగం కలిగేలా వీడియోలు చేశారు. రీమిక్సులు చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని ఆమె స్పష్టం చేశారు. సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదులు ఇస్తామని హెచ్చరించారు.
ఇలాంటి చర్యల్లో దేవస్థానం సిబ్బంది పాత్ర ఉందని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని.. దేవాదాయశాఖ కమిషనర్‌కు కూడా రిపోర్టు చేస్తామన్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా పీఆర్వో, కెమెరామెన్ తప్ప ఆలయం లోపలకి ఎవరి మొబైల్స్ అనుమతించబోమని.. బయట లాకర్లలో పెట్టుకోవాల్సిందేనని చెప్పారు. సింహాచల క్షేత్రంలో అన్యమత ప్రచారానికి ఆస్కారం లేదని ఈఓ సూర్యకళ చెప్పారు. టెండర్లు, ఔట్ సోర్సింగ్ స్టాఫ్ రిక్రూట్‌మెంట్‌లోనూ... హిందువులను, దేవునిపై విశ్వాసమున్నవారినే తీసుకుంటున్నామని తెలిపారు.
ఇదీ చూడండి: