CM Chandrababu Review on Maritime Policy: ప్రపంచ ప్రమాణాలతో కూడిన మారిటైమ్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మారిటైమ్ పాలసీ -2024 లక్ష్యాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. సుదీర్ఘతీర ప్రాంతాన్ని సద్వినియోగం చేద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌కి ఉన్న సుదీర్ఘ తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మారిటైమ్ హబ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని, దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. 1,053 కిలో మీటర్ల పొడవైన తీరప్రాంతాన్ని ప్రభావితం చేస్తూ ప్రపంచ స్థాయి సముద్ర తీర రాష్ట్రంగా మారిటైమ్ పాలసీని రూపొందించాలని అన్నారు.
ఏపీని వరల్డ్ క్లాస్ మారిటైమ్ స్టేట్‌గా, వినూత్న విధానాలతో తీరప్రాంతాన్ని అభివృద్ధి చేయడం, మౌలిక వసతుల కల్పన, సమర్ధవంతమైన పాలన ద్వారా సుస్థిర ఆర్ధిక వృద్ధి సాధించడం రాష్ట్ర విజన్‌గా చంద్రబాబు పేర్కొన్నారు. పోర్ట్ డెవలప్‌మెంట్, ప్రాట్ ప్రాక్సిమల్ ఏరియా డెవలప్‌మెంట్, షిప్ బిల్డింగ్ క్లస్టర్, అనుబంధ సముద్ర కార్యకలాపాలు ఇలా నాలుగు ముఖ్య ప్రతిపాదిత అంశాలు మారిటైమ్ పాలసీలో పొందు పరుస్తున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రతి అంశం కింద ఫోకస్ ప్రాంతాలను గుర్తించామని అధికారులు చెప్పారు.
ఫిషింగ్ హార్బర్‌లు, పోర్ట్‌ల అభివృద్ధి కోసం పీ4 మోడల్: హబ్, స్పోక్ మోడల్‌ను స్వీకరించడం ద్వారా హై కెపాసిటీ పోర్టుల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. పోర్ట్ పరిధిలోకి వచ్చే ప్రాంతాలు పరిశ్రమలు, రహదారులు, భవనాలు, టూరిజం శాఖలతో ఓడరేవులు అనుసంధానించాలని సూచించారు. భవిష్యత్తు అభివృద్ధి కోసం రాష్ట్రంలోని మూడు పారిశ్రామిక కారిడార్లను కూడా పోర్టులకు అనుసంధానించాలని స్పష్టం చేశారు. మౌలిక వసతుల కల్పన కోసం ప్రజలను కూడా భాగస్వాములను చేయాల్సిందిగా సూచనలు చేశారు. ఫిషింగ్ హార్బర్‌లు, పోర్ట్‌ల అభివృద్ధి కోసం పీ4 మోడల్‌ను ప్రోత్సహించాలని పేర్కొన్నారు.
ఏపీలో మారిటైన్ యూనివర్సిటీ: గ్లోబల్ స్థాయి సంస్థలు రాష్ట్రంలో నౌకా నిర్మాణం, ఓడల మరమ్మతుల పరిశ్రమలు నెలకొల్పేలా ఆకర్షించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆర్‌ఓ-ఆర్‌ఓ (Roll On-Roll Off), ఆర్‌ఓ-పాక్స్ (Roll-On/Roll-Off Passenger) సేవలతో సహా అంతర్గత జలమార్గాల కోసం హైబ్రిడ్ మోడల్‌ను అమలు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. సముద్ర రంగంలో పర్యాటకం, గ్రీన్ ఎనర్జీ కార్యక్రమాలను ఏకీకృతం చేయాల్సిందిగా సీఎం చంద్రబాబు సూచనలు చేశారు. అలాగే ఏపీలో మారిటైన్ యూనివర్సిటీ (Maritime University in AP) స్థాపించడానికి అందుకు అవసరమైన నైపుణ్యాభివృద్ధి, పరిశోధన తదితర అంశాలలో తోడ్పాటు కోసం ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీలను భాగస్వాములుగా చేసుకోవాలన్నారు. దీంతో పాటు ఈ రంగంలో సంస్కరణల ద్వారా మధ్యవర్తిత్వం (ఆర్బిట్రేషన్) డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజం కోసం ఉత్తమ పద్ధతులను ప్రవేశపెట్టాలని సూచనలు చేశారు.
దేశంలోనే మొదటి స్థానంలో ఏపీ: ఈ లక్ష్యాలను సాధించడానికి ఏపీ మారిటైమ్ బోర్డును బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. క్రూయిజ్ టెర్మినల్స్, ఫ్లోటెల్స్ వంటి వాటితో మారిటైమ్ టూరిజం అభివృద్ధి చేయాలని సూచించారు. అదే విధంగా క్లీన్ ఎనర్జీ వినియోగించి స్వయం సమృద్ధి సాధించేలా పోర్టులను తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం నాన్ మేజర్ పోర్టుల కేటగిరీలో ఎక్సిమ్ కార్గో (Exim Cargo) రవాణాలో 16% వృద్ధితో దేశంలో రెండవ ర్యాంకుని ఆంధ్రప్రదేశ్ సాధించిందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో రూ. 15.89 లక్షల కోట్ల జీఎస్డీపీ సాధిస్తామని అంచనా వేశామన్నారు. సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతుల్లో గత ఆర్ధిక సంవత్సరానికి గాను 32% వృద్ధితో దేశంలోనే మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉందని తెలిపారు. 2023-24 సంవత్సరం జాతీయ జీడీపీలో ఆంధ్రప్రదేశ్ వాటా 4.84%గా ఉందన్నారు.
లా అండ్ ఆర్డర్ సమస్య వస్తే ఎవ్వరినీ ఉపేక్షించను - 'బూడిద' గొడవపై చంద్రబాబు అసహనం
ఇసుకపై ఫిర్యాదులొస్తే సహించం - ప్రజల నుంచి సూచనలు స్వీకరణ: చంద్రబాబు
రూ.10 వేల కోట్ల పెట్టుబడి లక్ష్యం - నూతన టెక్స్‌టైల్ పాలసీ: సీఎం చంద్రబాబు