విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామి వారిని ఆలయ ట్రస్టుబోర్డు ఛైర్పర్సన్ సంచైత గజపతి దర్శించుకున్నారు. ఆలయ ఈవో సూర్యకళ ఆమెను సాదరంగా ఆహ్వానించారు. ముందుగా ఆలయంలోని కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్న అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన సంచైత గజపతి.. ఈవోకి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: విశాఖ నగర ప్రజల కోరికలు ఫలించేనా?