Simhachalam Temple Trust Board:విశాఖలోని సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ధర్మకర్తల మండలి అనువంశిక ఛైర్మన్‌గా అశోక్ గజపతిరాజును కొనసాగిస్తూ.. మరో 14 మందిని సభ్యులుగా నియమించింది. ఈ మేరకు దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి హరిజవహర్‌లాల్ ఉత్తర్వులు ఇచ్చారు. పదవీ రీత్యా సభ్యునిగా సింహాచలం దేవస్థానం ప్రధాన అర్చకులు కొనసాగుతారు. ప్రత్యేక ఆహ్వానితులుగా మరో నలుగురికి అవకాశం కల్పించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా కోరాడ చంద్రమౌళి, జనపరెడ్డి శేషారత్నం, కేశప్రగడ నరసింహమూర్తి, గేదెల వరలక్ష్మి నియమితులయ్యారు. ఈ ధర్మకర్తల మండలి రెండేళ్లపాటు కొనసాగునుంది.
గతంలో సంచైత నిమామకంతో వివాదం: రెండేళ్ల కిందట 2020 మార్చి 3న రాత్రివేళ సింహాచలం ఆలయ ఛైర్‌పర్సన్‌గా ఆనందగజపతిరాజు కుమార్తె సంచైత గజపతిరాజుతో పాటు సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంతో పెద్ద దుమారమే రేగింది. తెల్లవారగానే సంచైత బాధ్యతలు చేపట్టారు. దీనిపై అశోక్‌గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించడంతో ఆమె నియామకాన్ని రద్దు చేసి అశోక్‌ను కొనసాగిస్తూ తీర్పు వెల్లడించింది.
ఇదీ చదవండి:
కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణపై గవర్నర్‌తో సీఎం చర్చ.. రేపు మంత్రుల రాజీనామా !