అయోధ్యలో రామమందిర సంకల్ప నిర్మాణం ప్రారంభం అవుతున్న శుభ సందర్భంలో భారతదేశపు ప్రసిద్ధి గాంచిన పురాతన దేవాలయాల నుంచి "మృత్తిక "(మట్టి)ని సమీకరిస్తున్నారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లా సింహాచలవాసుడైన సింహాద్రి అప్పన్న క్షేత్రం నుంచి చందనం, మట్టిని అయోధ్యకు పంపిస్తున్నారు. నాటి రామరాజ్య పరిపాలన, మరలా పున: ప్రారంభం కావాలని ప్రపంచ దేశాల ధర్మ పాలనకు ఇది నాంది కావాలని విశ్వహిందూ పరిషత్ సంకల్పంతో ఈ కార్యక్రమం రూపుదాల్చింది. కరోనా ప్రభావం ఉన్న ఈ తరుణంలో స్థానికంగా ఉన్నటువంటి ముఖ్య కార్యకర్తలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇవీ చూడండి...