సింహాద్రి అప్పన్న దేవస్థానం ఈవోగా వెంకటేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు. అన్నవరం దేవస్థానం ఈవో త్రినాథరావు గతంలో సింహాచల దేవస్థానం ఇంఛార్జ్‌గా బాధ్యతలు నిర్వహించేవారు. పని ఒత్తిడితో తాను ఈ బాధ్యతల నిర్వహించలేనని ప్రభుత్వానికి తెలపటంతో నూతన ఈవోగా వెంకటేశ్వరరావును ప్రభుత్వం నియమించింది. ముందుగా స్వామిని దర్శించుకున్న ఆయన..అనంతరం బాధ్యతలు స్వీకరించారు. నూతన ఈవోకు ట్రస్ట్ బోర్డు సభ్యులు అభినందనలు తెలిపారు.
ఇదీచదవండి: రాష్ట్ర ప్రభుత్వ ఎస్ఎల్‌పీపై సోమవారం సుప్రీంలో విచారణ!