ETV Bharat / state

'వైభవంగా సింహాచలం అప్పన్న చందనోత్సవం' - simhachalam appanna

ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం.. అడిగిన వరాలు వెంటనే ప్రసాదించే స్వామిగా పేరున్న సింహాచలం అప్పన్న స్వామి చందనోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉత్సవం సందర్భంగా ఆలయాన్ని సుందరంగా అలంకరించారు.

కన్నల పండుగగా సింహాచలం అప్పన్న చందనోత్సవం
author img

By

Published : May 7, 2019, 4:03 AM IST

Updated : May 7, 2019, 8:56 AM IST

ఉత్తరాంధ్ర ప్రజల ప్రత్యక్ష దేవదేవుడు, ఏడాది లో ఒక్క సారి మాత్రమే తన నిజ రూప కటాక్ష వీక్షణం ఇచ్చే వరాహ నరసింహ స్వరూపుడు శ్రీ సింహాచల వరాహ లక్ష్మీ నరసింహ స్వామి చందనోత్సవం ఘనంగా జరుగుతోంది. వైశాఖ శుద్ధ తదియ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి తన వంటిపై 12 మడుగుల చందనపు పూత తొలగించి తన నిజరూపాన్ని భక్తులకు దర్శించి భాగ్యం ఇస్తున్నాడు. వంశ పారంపర్యంగా పూసపాటి వంశస్తులు తెల్లవారుజామున 2 గంటల సమయంలో తొలి చందనం సమర్పించగా ,అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.

ఉపముఖ్యమంత్రి చినరాజప్ప, ఎంపీ అవంతి శ్రీనివాసరావు, కేంద్ర మాజీ మంత్రి ఎం ఎం పల్లంరాజు, శాసన సభ్యుడు బండారు సత్యనారాయణ, గౌతు శ్యామ్ సుందర్ శివాజీ .గణబాబు, పిలా గోవిందు, అనిత... స్వామిని దర్శనం చేసుకున్నారు. శాసన మండలి సభ్యుడు పి వి యన్ మాధవ్ , రాష్ట్ర పోలీస్ డిజిపి ఆర్పీ ఠాగూర్, పోలీస్ కమిషనర్ మహేష్ చంద్ర లడ్డతో పాటు క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ ప్రత్యేక పూజలు పాల్గొన్నారు. సుమారూ 3 లక్షల మంది స్వామి దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశారు.

'వైభవంగా సింహాచలం అప్పన్న చందనోత్సవం

చందనోత్సవం సందర్భంగా ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. విద్యుత్ దీప కాంతులతో వెలిగిపోయింది. రకరకాలు పూలతో ఆలయ ప్రాంగణాన్ని అలంకరించారు. ఎటు చూసినా కంటికి ఇంపుగా... పచ్చని తోరణాలతో అద్భుతంగా తీర్చి దిద్దారు.

ఈ వేడుక కోసం దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. దాదాపు 3లక్షల మంది భక్తులు స్వామి దర్శించుకునే విధంగా బారిగేట్లు, క్యూ లైన్లు ఏర్పాటు చేసింది. ఎండలు అధికంగా ఉండటంతో ప్రాంగణంలో చలువ పందిళ్లు వేశారు. మజ్జిగ ,మంచినీళ్ల సరఫారా చేస్తున్నారు. భక్తులను కొండ కింద నుంచి పైకి తరలించడానికి ఆర్టీసీ బస్సులను ఉచితంగా నడపుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలో జరగకుండా అధికారులు 600మంది పోలీసులను నియమించారు.

ఇవీ చూడండి-వామ్మో ఫొని.. వెళ్తూ వెళ్తూ మంట పెట్టింది!

Intro:AP_ONG_82_06_MUGISINA_POLING_AV_C7

ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజక వర్గం లోని కలనూతల గ్రామం లో రీ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఓటు హక్కు వినియోగించుకోవడం లో గ్రామస్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మొత్తం 1,070 ఓటర్లు ఉండగా 931 ఓట్లు పొలయ్యాయి. వీరిలో మహిళా ఓటర్లు 473 ఉండగా...పురుషులు 458 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 87 శాతం నమోదైంది. గత నెల 11 న నిర్వహించిన ఎన్నికల్లో 800 ఓట్లు పోలవ్వగా ఈ రీ పోలింగ్ లో 131 ఓట్లు అధికంగా నమోదయ్యాయి. పోయిన ఎన్నికల్లో ఈవిఎం పనిచేయక పోవడం రీ పోలింగ్ నిర్వహించాల్సి వచ్చింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్ కేంద్రం పరిసర ప్రాంతం లో పోలీసులు పటిష్ట బండిబస్తు ఏర్పాటు చేశారు. అటవీ ప్రాంతం కావడం తో డ్రోన్ కెమెరా తో నిఘా పర్యవేక్షించారు. ఓటింగ్ సరళిని కలెక్టర్ వినయ్ చంద్, ఎస్పీ పరిశీలించారు. ఓటింగ్ సరలిలో తెదేపా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు శిద్దా రాఘవరావు, అజీతారావు పాల్గొని ఓటింగ్ తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. మొత్తం గా రీ పోలింగ్ ప్రశాంతంగా ముగియడం తో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Body:ప్రశాంతంగా ముగిసింది రీ పోలింగ్.

Conclusion:8008019243.
Last Updated : May 7, 2019, 8:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.