విశాఖపట్నంలోని పాడేరులో ఉన్న శ్రీ మోదకొండమ్మ అమ్మవారి హుండీ ఆదాయాన్ని లెక్కించారు. ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ లెక్కింపులో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నాలుగు నెలల్లో 7లక్షల 5వేల 695 రూపాయల ఆదాయం వచ్చింది.
కరోనా లాక్ డౌన్ తర్వాత ఇంత మొత్తం ఆదాయం రావడంతో భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారనే విషయం తెలుస్తోందని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. మోదకొండమ్మ అమ్మవారి తీర్థ మహోత్సవాలు... ఈనెల 24 నుంచి నిర్వహించనున్నట్లు తెలిపారు. అదేరోజు పోతురాజు స్వామి విగ్రహ ప్రతిష్ఠ చేయనున్నట్లు వెల్లడించారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. ఆ రోజు భక్తులు ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి:విశాఖలోని దేవాలయాల్లో సందడి..