ETV Bharat / state

ఫ్లెక్సీ వ్యవహారంలో విచారణ... కోచ్​లకు షోకాజ్ నోటీసు - show cause

విశాఖ బీచ్​ రోడ్డులో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో తప్పులు దొర్లి సోషల్​ మీడియాలో వైరల్​గా మారటంతో దీనిపై విచారణ మొదలుపెట్టారు అధికారులు. ఇద్దరు కోచ్​లకు షోకాజ్ నోటీస్ జారీ చేశారు.

ఫ్లెక్సీ
author img

By

Published : Aug 29, 2019, 9:32 PM IST

విశాఖ బీచ్ రోడ్డులో క్రీడా దినోత్సవ ఫ్లెక్సీ ఏర్పాటులో పొరపాటుపై జేసీ విచారణ జరిపారు. క్రీడా విభాగానికి చెందిన ఇద్దరు కోచ్‌లు ఫ్లెక్సీపై క్రీడాకారిణి పేరు తప్పుగా అచ్చు వేసినట్లు గుర్తించారు. వారివురికి జేసీ శివశంకర్‌ షోకాజ్ నోటీస్ జారీ చేశారు.

అసలు ఏం జరిగిందంటే

విశాఖ బీచ్‌ రోడ్డులో ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ తప్పిదాలు నవ్వుల పాల్జేశాయి. టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా ఫొటో ముద్రించిన బ్యానర్‌పై మాజీ అథ్లెట్‌ పీటీ ఉష పేరు రాశారు. క్రీడా దినోత్సవం సందర్భంగా బీచ్‌ రోడ్డులో మంత్రి అవంతి శ్రీనివాస్‌ క్రీడా ర్యాలీ ప్రారంభించారు. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన క్రీడాకారులు ఈ ఫ్లెక్సీ చూసి విస్తుపోయారు. కనీసం నేటితరం క్రీడాకారుల పేర్లు కూడా తెలియదా? అంటూ బహిరంగంగానే చర్చించుకున్నారు. సోషల్ మీడియాలోనూ ఇది వైరల్​గా మారింది.

ఇదీ చదవండి

వైరల్: సానియామీర్జా ఫొటోకు పీటీ ఉష పేరు

Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231Body:ap_rjy_34_29_purohit_curency_p_v_raju_av_AP10025_SD తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణంలో కూలిన పాత భవనంలో ఒంటరిగా నివాసముంటూ మృతి చెందిన పురోహితుడు ఇంట్లో బయట పడ్డ నగదు మూటల్లో మొత్తం సుమారు రూ. 6 లక్షలు ఉందని లెక్క తేల్చరని సమాచారం. సుమారు 30 ఏళ్లుగా ఆ కూలిన ఇంట్లోనే ఒంటరిగా వుంటుండగా చనిపోయిన తర్వాత చూస్తే నగదు మూటలు బయట పడ్డ విషయం విదితమే. ఇందులో సుమారు రూ. 6 లక్షలు లెక్కించగా అనేక నోట్లు చెడబట్టి పోయాయి. అనేక నాణాలు మట్టిలో కలిసిపోవడంతో జల్లించి వేరు చేశారు. ఈ సొమ్మును అంత్యక్రియలు, ఆ తర్వాతి కార్యక్రమాలకు వినియోగించి మిగిలిన మొత్తాన్ని ఏమి చేయాలన్న దానిపై స్థానికులు, బ్రాహ్మణ సంఘాలు ఆలోచిస్తున్నాయి.Conclusion:ఓవర్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.