ETV Bharat / state

గిరిజన బిడ్డలుగా మారిపోయిన శోభా స్వాతిరాణి దంపతులు

రాష్ట్ర గిరిజన సహకార సంస్థ ఛైర్ పర్సన్ శోభ స్వాతి రాణి అచ్చం అడవి బిడ్డగా మారిపోయారు. గిరిజన సంస్కృతికి సంబంధించిన బట్టలు ధరించారు. ఆమె భర్త కూడా పంచకట్టులో మెరిశారు. ఇద్దరూ కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు.

shobha-swatirani-couple-in-tribal-traditional-attire-at-vishaka
గిరిజన బిడ్డలుగా మారిపోయిన శోభా స్వాతిరాణి దంపతులు
author img

By

Published : Jan 3, 2022, 11:48 AM IST

విశాఖపట్నం జల్లా మన్యంలోని మారుమూల గ్రామాల్లో 236 డీఆర్‌ డిపోలను ఏర్పాటు చేయడానికి కేంద్ర గిరిజన సంక్షేమ శాఖకు ప్రతిపాదనలు పంపించినట్లు గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఛైర్‌పర్సన్‌ శోభా స్వాతిరాణి తెలిపారు. చాపరాయి జలవిహారిని ఆదివారం ఆమె కుటుంబసమేతంగా సందర్శించారు. అనంతరం మండల కేంద్రంలోని పెట్రోల్‌ బంకులో ఏర్పాటు చేసిన కాఫీ హౌస్‌లో జీసీసీ ఉత్పత్తులను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ తితిదేకు జీసీసీ ద్వారా 1800 కేజీల పసుపు పంపించామని తెలిపారు.

shobha-swatirani-couple-in-tribal-traditional-attire-at-vishaka
గిరిజన సంప్రదాయ అలంకరణలో శోభా స్వాతిరాణి

అటవీ ఫలసాయాలు కొండచీపుర్లు, అడ్డాకులు, మిరియాల కొనుగోలుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. అరకు జీసీసీ బ్రాంచి మేనేజర్‌ సింహాచలం తదితరులు పాల్గొన్నారు. అనంతరం పెదలబుడు గిరి గ్రామదర్శినిని ఆమె సందర్శించారు. కొండకోనల్లోని అడవిబిడ్డల మాదిరి కట్టూబొట్టూతో సందడి చేశారు. అడ్డుకట్టు చీరతో పాటు గిరిజన సంప్రదాయ ఆభరణాలను ధరించి అచ్చం ఆదివాసీ మహిళలా మారిపోయారు. ఆమె భర్త గణేష్‌ సైతం పంచెను ధరించి నీళ్ల కావిడిని పట్టుకొని ఫొటోలు దిగారు.

ఇదీ చూడండి:

సచివాలయ సిబ్బంది చేతివాటం.. పింఛన్​లో వెయ్యి రూపాయల కోత!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.