యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా విశాఖలో భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. గుంటూరుతోపాటు నల్లమలలో యురేనియం తవ్వకాలకు ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలని కోరారు. యురేనియం తవ్వకాల వల్ల పర్యావరణం కలుషితమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు విస్మరిస్తూ... ప్రభుత్వం ఇచ్చిన తీర్పు ఖండిస్తున్నామన్నారు. యురేనియం తవ్వకాలకు ఇచ్చిన అనుమతులు వెనక్కి తీసుకోవాలని ఏస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు.
ఇదీచదవండి