రాష్ట్రంలో నాటుసారా విచ్చలవిడిగా దొరుకుతుంది.. ఎక్సైజ్ శాఖ ఏమి చేస్తుందని స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించిన నేపథ్యంలో ఆబ్కారీ శాఖ నాటుసారాపై కదం తొక్కింది. ఆంధ్ర-ఒడిశా సరిహద్దు మంగబంద వద్ద ఎక్సైజ్ సీఐ అనిల్ కుమార్ బృందం రాత్రివేళల్లో కాపు కాశారు. పడవలపై ఒడిశా నుంచి ఆంధ్రాకు తరలించి ఆటోలు, ద్విచక్ర వాహనాల్లో తరలిస్తుండగా పట్టుకున్నారు. 460 లీటర్ల నాటుసారాతో పాటు రెండు ఆటోలు, రెండు మోటార్ సైకిళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. అక్రమ నాటు సారా తయారీ కానీ రవాణా గాని చేస్తే కఠినమైన శిక్షలు తప్పవని సీఐ అనిల్ కుమార్ హెచ్చరించారు.
ఇది చదవండి జీడిపిక్కల కర్మాగారం పునఃప్రారంభం...పనుల్లోకి కార్మికులు