ETV Bharat / state

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్​

author img

By

Published : Dec 26, 2020, 9:28 PM IST

రెండు తెలుగు రాష్ట్రాల్లో 13 దోపిడీలకు పాల్పడిన ఆరుగురు సభ్యుల ముఠాను విశాఖ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. రిమాండ్​కు తరలించారు. నిందితుల నుంచి చోరీలకు సంబంధించిన సొమ్మును రికవరీ చేసే పనిలో ఉన్నారు.

thiefs gang caught by police
'13 దోపిడీల అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్​'

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 13 దోపిడీలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను విశాఖ జిల్లా అచ్యుతాపురం పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నామని నర్సీపట్నం ఏఎస్పీ సింహ తెలిపారు. ఆరుగురు సభ్యుల ఈ ముఠా ఇటీవల అచ్యుతాపురం మండలంలో ఒక ఇంట్లో దోపిడీకి పాల్పడింది. ఇంట్లో వాళ్లందరిపై కత్తులతో దాడి చేసింది. వారి చేతులు కట్టేసి 8 తులాల బంగారం, 80 వేల నగదు దొంగిలించింది. ఇదే తరహాలో రెండు రాష్ట్రాల్లో 13 చోరీలకు పాల్పడ్డారు.

తమకు అందిన ఫిర్యాతు మేరకు.. స్థానిక సీఐ నారాయణరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయగా.. అచ్యుతాపురం పోలీసులు చాకచక్యంగా దొంగలను పట్టుకున్నారు. రెండు రాష్ట్రాల్లో నేరాలకు పాల్పడిన వీరిని పట్టుకోవడంతో దోపిడీలు చేసిన బంగారం, నగదును రికవరీ చేసే పనిలో పోలీసు నిమగ్నమయ్యారు. నిందితులంతా విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన వారుగా గుర్తించారు. వారిని రిమాండ్​కు తరలించారు.

ఇదీ చదవండి:

ఇళ్ల పట్టాలు ఇచ్చేది జగనన్న కాదు చంద్రన్న అట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.