విశాఖ జిల్లా అనకాపల్లి మండలం వెంకుపాలెంలో, కశింకోట మండలం తాళ్లపాలెంలో 'రాయితీపై రైతులకు అందించే విత్తనాలు' కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు. ఖరీఫ్ ప్రారంభం కావడం వల్ల ముందస్తుగా విత్తనాలను రాయితీపై అందించేలా వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. గతంలో మండల కేంద్రాల్లో రాయితీ విత్తనాలను అందజేసేవారని... ఇప్పుడు ప్రతి గ్రామ పంచాయతీలో అందిస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ నెల 30వ తేదీ నుంచి రైతు భరోసా కేంద్రం ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించనున్నట్లు వివరించారు.
ఇధ చదవండి :