విశాఖపట్నం జిల్లా దారకొండ నుంచి తెలంగాణలోని ఖమ్మం జిల్లా కొణిజర్లకు 165 కిలోల గంజాయిని తరలిస్తున్నవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్లాస్టిక్ కుర్చీల పేరుతో మినీ వ్యాన్ ద్వారా గంజాయి తరలిస్తుండగా అడ్డుకున్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేశామని జీలుగుమిల్లి డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయి, వాహనంతో కలిపి 12 లక్షలు రూపాయల విలువ ఉంటుందన్నారు.
ఇదీ చూడండి: