విశాఖ జిల్లా మారుమూల గిరిజన ప్రాంతాల్లో సత్యసాయి సేవా సంస్థ సహాయ కార్యక్రమాలు చేపట్టింది. లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్నవారిని ఆదుకునేందుకు ముందడుగు వేసింది. విశాఖ మన్యం హుకుంపేట మండలం తడిగిరి పరిసరాల్లోని 51 కుటుంబాలకు నిత్యావసరాల కిట్టును అందజేశారు. కరోనా నేపథ్యంలో గిరిజనులు చాలా అవస్థలు పడుతున్నారని.. వారికి తమకు తోచిన విధంగా సాయపడుతున్నామని సంస్థ నిర్వాహకులు తెలిపారు.
ఇవీ చదవండి.. 'వలస కార్మికులకు ఆహారధాన్యాలు పంపించండి'