ETV Bharat / state

పంచాయతీ నిధులను వాడుకోవటాన్ని నిరసిస్తూ.. సర్పంచ్​ల భిక్షాటన - SARPANCHES PROTEST

SARPANCHES PROTEST : పంచాయతీల ఖాతాల నుంచి సర్పంచ్‌లకు తెలియకుండానే నిధులు డ్రా చేయడంపై రాష్ట్రంలో పలుచోట్ల ఆందోళనలు కొనసాగాయి. అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో సర్పంచులు నిరసన తెలిపారు. అనంతపురం టవర్ క్లాక్ వద్ద ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నూలు, పాడేరులో సర్పంచ్‌లు భిక్షాటన చేశారు.

సర్పంచ్​ల భిక్షాటన
సర్పంచ్​ల భిక్షాటన
author img

By

Published : Apr 5, 2022, 5:52 PM IST

SARPANCHES PROTEST : పంచాయతీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం వాడుకోవటాన్ని నిరసిస్తూ రాష్ట్రంలో పలు జిల్లాల్లో సర్పంచ్​లు ఆందోళన చేపట్టారు. తమ పంచాయతీల నిధులు తిరిగి ఇవ్వాలని నినాదాలు చేశారు.

కర్నూలులో భిక్షాటన: పంచాయతీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం వాడుకోవటాన్ని నిరసిస్తూ.. కర్నూలులో సర్పంచులు భిక్షాటన చేశారు. జిల్లా పరిషత్ ఆవరణలోని గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం.. రాజ్ విహార్ కూడలిలో భిక్షాటన చేశారు. తమ నిధులు వాడుకోవటం వల్ల గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

తిరిగి ఇవ్వాలని నినాదాలు : అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రధాన కేంద్రం పాడేరులో సర్పంచులు భిక్షాటన చేపట్టారు. 14 ,15 ఆర్థిక సంఘం నిధులను జగన్ ప్రభుత్వం వెనక్కి తీసుకుందని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు.పాడేరు, అరకులోయ నియోజకవర్గాల్లోని పంచాయతీ సర్పంచ్‌లు పాల్గొన్నారు. తమ పంచాయతీల నిధులు తిరిగి ఇవ్వాలని నినాదాలు చేశారు.

సర్పంచ్​ల అరెస్టులు : పంచాయతీ ఖాతల నుంచి నిధులను సర్పంచ్​లకు తెలియకుండా ప్రభుత్వం కాజేసిందని అనంతపురం, సత్యసాయి జిల్లాల సర్పంచ్​లు ఆందోళన చేపట్టారు. తెదేపా పిలుపు మేరకు ఉమ్మడి జిల్లాలోని సర్పంచులు అనంతపురం జిల్లా కేంద్రంలోని టవర్ క్లాక్ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఆందోళన చేస్తున్న వారిని అరెస్టు చేశారు.

పంచాయతీ నిధులను ప్రభుత్వం వాడుకోవటాన్ని నిరసిస్తూ.. సర్పంచ్​ల భిక్షాటన

ఇదీ చదవండి: విద్యుత్​ ఛార్జీల పెంపుపై తెదేపా నేతల నిరసన... గద్దె రామ్మోహన్​ భిక్షాటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.