ETV Bharat / state

విశాఖ జిల్లాలో ఇసుక మాయం.... విలువ కోటీ 63 లక్షలు!

ఇటీవల విశాఖ జిల్లాలోని ప్రభుత్వ డిపోల్లో ఇసుక గల్లంతు విషయం చర్చనీయాంశమైంది. గల్లంతైన ఇసుక విలువ కోటి రూపాయలకు పైగా ఉంటుందని అధికారిక లెక్కల అంచనా. అయితే దీనిపై సంబంధిత అధికారులు గ్రౌండ్ లాస్ పేరుతో చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

sand overflow in vizag district
విశాఖ జిల్లాలో ఇసుక గల్లంతు
author img

By

Published : Nov 12, 2020, 2:20 PM IST

రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్త ఇసుక విధానం అమల్లోకి వచ్చింది. విశాఖ జిల్లాలో ఇసుక లభ్యమయ్యే రీచ్​లు ఎక్కువగా లేనందున తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లోని నదుల నుంచి ఇసుక తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. ఇందుకోసం భీమిలి, అనకాపల్లి, చోడవరం, అగనంపూడి, నక్కపల్లి, నర్సీపట్నం, అచ్యుతాపురం తదితర ప్రాంతాల్లో అధికారికంగా ఇసుక డిపోలు ఏర్పాటుచేశారు.

కరవైన పర్యవేక్షణ

ఇసుక అవసరమైనవారు ఆన్​లైన్​లో బుక్ చేసుకోవాలి. టన్ను రేటు రూ. 375 కాగా.. రవాణా ఛార్జీలు అదనం. రాజమండ్రి, శ్రీకాకుళం నుంచి ఆయా డిపోలకు ఉన్న దూరాన్ని బట్టి కనిష్టంగా రూ. 1250, గరిష్టంగా రూ. 1450 వరకు టన్ను రేటు ఉంది. ఆన్​లైన్​లో డబ్బులు చెల్లించిన వినియోగదారులు తమకు సమీపంలో ఉన్న డిపోల నుంచి ఇసుక తీసుకెళ్లాలి. అయితే డిపోలో సరైన పర్యవేక్షణ లేక సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తూకం వేయకుండా లోడింగ్ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నేతలు ఫోన్ చేస్తే బుక్ చేసినదానికన్నా ఎక్కువ ఇసుక ఇస్తున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. దీంతో వాస్తవంగా డిపోలకు వచ్చిన ఇసుక, కొనుగోలుదారులు తీసుకెళ్లిన ఇసుక మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాల నుంచి సరఫరా అయిన ఇసుకకు.. ఆన్​లైన్ బుకింగ్ ద్వారా ఆయా డిపోల్లో విక్రయించిన ఇసుకకు వేలాది టన్నుల తేడా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఏపీఎండీసీ అధికారులు రంగంలోకి దిగి వాస్తవ పరిస్థితిపై విచారణ జరుపుతున్నట్లు సమాచారం.

కోటీ 63 లక్షల విలువైన ఇసుక గల్లంతు

విశాఖ జిల్లాకు సంబంధించి 8 ఇసుక డిపోల్లో సుమారు 1,39,909 టన్నుల ఇసుక గల్లంతైనట్లు అధికారులు గుర్తించారు. అనకాపల్లి డిపోలో 4,400, నర్సీపట్నం డిపోలో 2020, నక్కపల్లి డిపోలో 1,700, అచ్చుతాపురం డిపోలో 1,500, చోడవరంలో 700, భీమిలిలో 169, అగనంపూడిలో 2,160 టన్నుల చొప్పున ఇసుక తేడా వచ్చింది. తేడా వచ్చిన ఇసుకను నగదు రూపంలో లెక్కిస్తే రవాణా చార్జీలతో కలిపి కోటీ 63 లక్షల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

విచారణ

నర్సీపట్నంలో ఇసుక గోల్​మాల్ వ్యవహారం ఘటనకు సంబంధించి మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అయ్యన్నపాత్రుడు ఇప్పటికే అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇసుక గల్లంతైన విషయంపై దర్యాప్తు జరిపి కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై సకాలంలో అధికారులు స్పందించకపోతే ఒకటి రెండు రోజుల్లో అనకాపల్లిలోని గనుల శాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. జిల్లాలో ఇసుక గోల్​మాల్ వ్యవహారంపై జిల్లా శాండ్ ఆఫీసర్ డీవీఎస్ఎన్ రాజు మాట్లాడుతూ.. ఆన్​లైన్ డేటా ఆధారంగా గనుల శాఖ అధికారుల సహకారంతో ఇసుక లెక్కలు తేల్చి ఏపీఎండీసీకి నివేదిక ఇచ్చామని చెప్పారు . గ్రౌండ్ లాస్ కింద పోయిన ఇసుక తీసివేయగా మిగిలిన 13,074.46 టన్నుల ఇసుక ఏమైందన్న దానిపై విచారణ చేస్తున్నామని తెలిపారు.

ఇవీ చదవండి..

ప్రాథమిక దర్యాప్తు చేయకుండా అరెస్ట్ చేస్తారా..?- హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.