విశాఖ జిల్లా అనకాపల్లిలోని లక్ష్మీదేవి పేట, వుడ్ పేటలో సమోసా తయారు చేస్తున్న రెండు సెంటర్లపై విజిలెన్స్ అధికారులు ఆహార కల్తీ నియంత్రణ అధికారితో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజిలెన్స్ సీఐ నారీమణి తెలిపిన వివరాల ప్రకారం విశాఖ జిల్లా అనకాపల్లిలో సమోసాలు తయారు చేసిన చోట నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని విజిలెన్స్ సీఐ.. నారీమణి పేర్కొన్నారు. ఆహార కల్తీ నియంత్రణ అధికారితో కలిసి తనిఖీలు నిర్వహించారు. తయారీలో ఉపయోగిస్తున్న ఉల్లిపాయ, బంగాళాదుంపలో నాణ్యత లేదన్నారు. వంట నూనె నాసిరకంగా ఉందన్నారు. వీటిని నమూనాలు సేకరించి ప్రయోగశాలకు పంపుతామని.. నివేదిక వచ్చిన తర్వాత కేసు నమోదు చేసి తయారీదారులపై చర్యలు తీసుకుంటామని వివరించారు.
ఇది కూడా చదవండి.