Sirivennela seetharamasastry: సిరివెన్నెల సీతారామశాస్త్రి స్వస్థలం విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతిపట్ల.. అతని బంధువులు స్నేహితులు, అనకాపల్లి వాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఇకలేరు అన్న వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
హోమియో వైద్యుడు యోగి- సుబ్బలక్ష్మి దంపతులకు సిరివెన్నెల సీతారామశాస్త్రి మొదటి సంతానం. 1955 మే 20న అనకాపల్లిలో జన్మించిన సిరివెన్నెల.. అనకాపల్లి బీఎస్ఎన్ఎల్లో సిరివెన్నెల కొంతకాలం పనిచేశారు. అనంతరం గేయ రచయితగా.. తెలుగు చిత్రసీమలో ఉన్నత స్థాయికి ఎదిగారు. సీతారామశాస్త్రి గారి తల్లికి సుబ్బలక్ష్మికి.. ఐదుగురు చెల్లెలు. సీతారామశాస్త్రి మృతిపట్ల ఆయన పిన్ని శేషారత్నం, ఇతర కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు.
ఇదీ చదవండి..: Sirivennela died: ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల ఇకలేరు