రాష్ట్రవ్యాప్తంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో ప్రైవేట్ బస్సులపై దాడులు కొనసాగుతున్నాయి. ఈరోజు ఉదయం విశాఖ జిల్లా అగనంపూడి టోల్ గేట్ వద్ద రవాణాశాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. రవాణా శాఖ అధికారి రాజారత్నం ఆధ్వర్యంలో 15 మంది ఇన్స్పెక్టర్లు, 60 మంది సిబ్బందితో దాడులు నిర్వహించారు. 66 బస్సులపై కేసు నమోదు చేయగా.... వీటిలో ఒక బస్సుకు ట్యాక్స్ లేనందున సీజ్ చేశామని రాజారత్నం తెలిపారు.
ఇవి కూడా చదవండి: