ETV Bharat / state

'ప్రైవేట్ పాఠశాలల బస్సుల్లో తనిఖీలు' - rto

విశాఖలోని ప్రైవేట్ పాఠశాల బస్సులపై మూడో రోడు తనిఖీలు కొనసాగుతున్నాయి. ఫిట్​నెస్ సర్టిఫికెట్ లేని బస్సులను సీజ్ చేశారు. పిల్లలను బస్సులో పంపించే ముందు తల్లిందండ్రులు బస్సు ఫిట్​నెస్ పత్రాలను పరిశీలించాలని అధికారులు సూచించారు.

'ప్రైవేట్ పాఠశాలల బస్సుల్లో తనిఖీలు'
author img

By

Published : Jun 17, 2019, 11:42 AM IST

'ప్రైవేట్ పాఠశాలల బస్సుల్లో తనిఖీలు'

విశాఖలోని ప్రైవేట్ పాఠశాలల బస్సులపై రవాణా శాఖ అధికారులు దాడులు కొనసాగుతున్నాయి. మూడు రోజులుగా జిల్లావ్యాప్తంగా ఆరు బృందాలుగా విడిపోయి ప్రైవేట్ పాఠశాలల బస్సుల్లో తనిఖీలు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు రెండు వేల బస్సులు ఉన్నప్పటికీ... అందులో దాదాపు 1600ల బస్సులు మాత్రమే ఫిట్​నెస్ సర్టిఫికేట్​లు ఉన్నాయని అధికారులు తెలిపారు. ప్రతి బస్సులో డ్రైవర్​కు సంబంధించిన పూర్తి సమాచారం..డ్రైవర్​ సీటు వెనుక భాగంలో పొందుపరచాలని సూచించారు. రవాణా శాఖ సూచించిన నిబంధనలను తప్పకుండా పాటించాలని హెచ్చరించారు. మూడు రోజులుగా నిర్వహించిన డ్రైవ్​లో నిబంధనలు ఉల్లంఘించిన 20బస్సులపై కేసులు నమోదు చేసినట్లు.. మరో 18బస్సులను సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

Intro:Ap_Vsp_61_17_RTO_Rides_On_Pvt_School_Buses_Ab_C8

Body:విశాఖలో ఫిట్నెస్ లేని ప్రైవేట్ పాఠశాలల బస్సులపై రవాణా శాఖ అధికారులు దాడులు నిర్వహించారు గత మూడు రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఆరు బృందాలుగా విడిపోయి ప్రైవేట్ పాఠశాలల బస్సుల్లో తనిఖీలు నిర్వహించారు జిల్లావ్యాప్తంగా సుమారు రెండు వేల బస్సులు ఉన్నప్పటికీ అందులో దాదాపు 1600 బస్సులు మాత్రమే ఫిట్నెస్ సర్టిఫికెట్ లు తీసుకోగా ఇంకా సుమారు 400 బస్సులు ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉందని రవాణా శాఖ అధికారులు తెలిపారు ప్రతి బస్సులో డ్రైవర్ కు సంబంధించిన పూర్తి సమాచారం డ్రైవర్ సీటు వెనుక పొందుపరచడం తో పాటు రవాణాశాఖ సూచించిన నిబంధన దాన్ని తప్పకుండా పాటించాలని హెచ్చరించారు వారానికి ఒక్క రోజైనా పాఠశాల యాజమాన్యం సిబ్బంది కాని విద్యార్థుల తల్లిదండ్రులు గాని బస్సులో ప్రయాణించి బస్సుల పరిస్థితిని డ్రైవర్ల పరిస్థితిని గమనించాలని కోరారు గత మూడు రోజులుగా నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్ లో ఇప్పటివరకు నిబంధనలను ఉల్లంఘించిన 20 బస్సులపై కేసులు పెట్టినట్లు మరో 18 బస్సులను సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు జిల్లావ్యాప్తంగా అన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు పూర్తిస్థాయిలో బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్లు తీసుకున్నంత వరకు తనిఖీలు కొనసాగిస్తామని రవాణా శాఖ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వెంకటేశ్వరరావు తెలిపారు
---------
బైట్ వెంకటేశ్వరరావు రవాణా శాఖ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ విశాఖపట్నం
--------- ( ఓవర్).

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.