Coal Pollution On Roads: కాలుష్య కారకాలలో అగ్రస్ధానంలో ఉన్న ముడి పదార్ధాలలో బొగ్గు ఒకటి. బొగ్గు ఆధారిత విద్యుత్తు ఉత్పత్తి కేంద్రానికి దగ్గరలో ఉన్న గ్రామాలు, వాటికి వెళ్లేరహదార్ల పరిస్దితి లో మరింతగా తీవ్రంగా ఉంటుంది. గాలి జోరు ఎక్కువైందంటే ఇక ఆ రహదారిమీద వెళ్లే వారి పరిస్ధితి వర్ణనాతీతం. విశాఖ అంతా ఈ సమస్య కన్పిస్తుంది. అనకాపల్లి జిల్లా ఎన్టీపీసీ పరవాడ పరిసర గ్రామాల మీదుగా వెళ్లే రహదారి కాలుష్య పరిస్దితిపై కథనం.
రహదారిపై బొగ్గు పడితే అది గాలికి ఎగిరి వాహనదారులకు కలిగించే ఇబ్బంది అంతా ఇంతా కాదు. డ్రైవింగ్ సమయంలో ఒక చిన్న రేణువు కంట్లో పడితే ఆ బాధ వర్ణనాతీతం. అనకాపల్లి జిల్లా లంకెల పాలెం, పరవాడ సమీపాన వెళ్లే ప్రధాన రహదారి అత్యంత దయనీయంగా మారింది. వేగ నియంత్రికల వద్ద బొగ్గు కింద పడటంతో పాటు నియంత్రణ లేని బొగ్గు లారీలతో పారి గాలికి ఎగిరి వెనకాల వచ్చే శ్రామిక ప్రాంతాల్లోని ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు, అవస్థలు పడుతున్నారు. లారీలపై పరదాలు నామమాత్రంగా ఉండడం వల్ల అవన్నీ కిందకే జారుతున్నాయి. జాతీయ రహదారి మీదుగా యథేచ్ఛగా రాకపోకలు సాగించి లంకెలపాలెం కూడలి నుంచి పరవాడ మార్గంలో రోడ్డు మార్గం వెంబడి ఫార్మాసిటీ, పాలవలస, అచ్యుతాపురం లోని కంపెనీలకు నిత్యం ప్రయాణిస్తుంటాయి.
లంకెలపాలెం పైవంతెన వద్ద పేరుకుపోయిన బొగ్గు అంచులు వెంబడి ప్రమాదకర పరిస్ధితి ఎదురుతోంది. పేరుకు పోయిన బొగ్గు మీదుగా వాహనాలు రాకపోకల వల్ల నలిగి బూడిదగా మారి గాలికి ఎగురడం రహదారి పక్కనున్న నివాసితులు, ద్విచక్రవాహన చోదకులకు నరకం కనిపిస్తోంది.
వీటికి తోడు ఎన్టీపీసీ కోసం వందలాది బొగ్గు లారీలు, పీసీ ఫ్లైయాష్లా రీల నుంచి బూడిద రాలి ఎగరడంతో అవస్థలు రెట్టింపవుతున్నాయన్నది వీరి ఆవేదన. దీనిని నియంత్రించేందుకు ఉన్న ఏకైక అవకాశం లారీలపై టార్పాలిన్లు సరిగా కట్టడం ఒక్కటే. ఆ విధంగా లేని వాహనాలను రహదారిపై తిరిగినప్పుడు అధికార్లు వాటికి జరిమానాలు విధించడం వల్ల అవి రోడ్డుపైకి రాకుండా చూసేందుకు వీలుంటుంది. రహదారి పక్కన బూడిద మేటలతో బొగ్గు రాలి కింద పడకుండా చర్యలు తీసుకోవాలని ఈ గ్రామాల ప్రజలు, ఈ రహదారిపైన వెళ్లేవారు ప్రభుత్వ యంత్రాంగాన్ని కోరుతున్నారు.
ెద్ద పెద్ద లారీల్లో బొగ్గు తరలించడం వల్ల రహదారిపై రాలి పడి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రోడ్డుపై పడే బొగ్గు వల్ల సాధారణ ప్రజలు ఇబ్బుందులు పడుతున్నారు. రోడ్డుపై వెళ్లాలంటే భయంగా ఉంటోంది. కనీసం బండిపై ఫ్యామిలీని తీసుకు వెళ్లాలంటే ఆలోచించే పరిస్థితి ఏర్పడుతుంది. వాయు కాలుష్యం వల్ల ఈ ప్రాంతంలో యువకులు మృతి చెందిన ఘటనలు నెలకొన్నాయి. బొగ్గు సరఫరా విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. జీ 20 సదస్సు కోసం మాత్రమే ఇటీవల రోడ్లు శుభ్రం చేశారు. వాహనదారుల కళ్లలో బొగ్గు ద్వారా వచ్చే దుమ్ము పడి ప్రమాదాలు ఏర్పడుతున్నాయి. ఇంత జరుగుతున్నా అధికారులు స్పందించడం లేదు.- నగర వాసులు
ఇవీ చదవండి: