విశాఖ జిల్లాలో జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఒకరు మృతి చెందగా ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. తగరపువలస జాతీయ రహదారి గోస్తనీనది బ్రిడ్జి సమీపంలో ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరోవ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం సిహెచ్ అగ్రహారానికి చెందిన గుడివాడ గోవింద్(22)గా గుర్తించారు. తీవ్రగాయాలైన గొర్లె రమణ(23) స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. భీమునిపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నర్సీపట్నం డిగ్రీ కళాశాల వద్ద ఆగి ఉన్న ట్రాక్టర్ను ద్విచక్రవాహనం ఢీ కొట్టింది. తీవ్ర గాయాలైన త్రినాధ రావు అనే ఉపాధ్యాయుడిని నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి