ETV Bharat / state

visaka accident: జాతీయ రహదారిపై ప్రమాదం...సీఐ ఈశ్వరరావు మృతి - vishaka district crime news

జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం
జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం
author img

By

Published : Nov 25, 2021, 6:24 AM IST

Updated : Nov 25, 2021, 9:54 AM IST

06:19 November 25

విశాఖ జిల్లాలో ఘటన

visaka accident: విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళుతున్న విశాఖ నగర త్రీటౌన్​ సీఐ ఈశ్వరరావు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. రాత్రి మూడు గంటల 40 నిమిషాలు సమయంలో పోలీస్ పెట్రోల్ వాహనంలో ఎండాడ మీదుగా మధురవాడలోని ఆయన నివాసానికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సీఐ ముందువైపు కూర్చున్న భాగాన బలంగా వాహనాన్ని ఢీ కొనడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. వాహనాన్ని నడుపుతున్న సంతోశ్‌కి తీవ్ర గాయాలు కాగా... ఆసుపత్రికి తరలించారు. నగర పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా సహా పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును తెలుసుకొనేందుకు సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఈ ఘటన అత్యంత దురదృష్టకరమన్న పోలీస్ కమిషనర్ మనీష్‌ కుమార్ సిన్హా...సీఐ ఈశ్వరరావు కష్టపడి పనిచేసే తత్వం ఉన్న ఒక నిబద్ధత కలిగిన అధికారిగా పేర్కొన్నారు.

ఇదీ చదవండి: 'బాధితులు నిద్రలేని రాత్రులు గడుపుతుంటే.. వైకాపా మొద్దునిద్రపోతోంది'

Last Updated : Nov 25, 2021, 9:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.