విశాఖ మన్యంలో జులై 22న బైక్ ను వ్యాన్ ఢీ కొట్టి ముగ్గురు మృతికి కారణమైన వ్యాన్ డ్రైవర్ ను జి.మాడుగుల పోలీసులు అరెస్టు చేశారు. విశాఖ మన్యం జి.మాడుగుల మండలం సాడేకు గ్రామ సమీపంలో జులై 22న ద్విచక్రవాహనంను వ్యాను కొట్టింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలతో పాటు బంధువు బాలుడు మృతి చెందారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ ని అరెస్టు చేసినట్లు జి.మాడుగుల సీఐ దేవుడుబాబు వెల్లడించారు. తమ పరిధిలో నడిపే వాహనాలకు సరైన పత్రాలు లేకపోతే కేసులు పెడతామని హెచ్చరించారు. నిత్యం వాహన తనిఖీలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: చోడవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి ఆగస్టు 2 వరకు సెలవులు