విశాఖ నగరంతో పాటు పట్టణాల్లో మంచినీటి కాలుష్య సమస్య తీవ్రంగా ఉందని, మంచినీటి వనరులు, పైపులైను వ్యవస్థలు, పైపులైన్లకు వినియోగించే పైపుల నాణ్యత తదితర అంశాలన్నీ నీటికాలుష్యానికి కారణమవుతున్నాయని విశ్రాంత ఐఏఎస్. అధికారి ఈఏఎస్.శర్మ పేర్కొన్నారు. ఏలూరు ఘటన నేపథ్యంలో బుధవారం ఆయన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డితో పాటు పలువురు ప్రభుత్వ పెద్దలకు ఈ-మెయిల్‌లో లేఖలు పంపారు. వాటిని మీడియాకు పంపించారు.
దేశంలోని 26 నగరాల్లో మోతాదుకు మించిన సీసంతో కలుషితమైన నీరే సరఫరా అవుతోందని ‘క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా’ (క్యుసీఐ) చేసిన అధ్యయనం తేలిందన్నారు.పుర/నగరపాలక సంస్థల్లో సీసం పూతతో తయారైన పీవీసీ పైపుల వినియోగం కూడా నీరు విషతుల్యం కావడానికి కారణమని తెలిపారు. కాలుష్యానికి కారణమతున్న అంశాలపై లోతైన దర్యాప్తు చేయించాలని కోరారు.
ఇదీ చదవండి:
మరో కొత్త కార్యక్రమం... 'జగనన్న జీవనక్రాంతి' పథకానికి శ్రీకారం