రింగువలల ద్వారా కొంతమంది పెట్టుబడిదారులు సంప్రదాయ మత్స్యకారుల పొట్ట కొడుతున్నారని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ ఆరోపించారు. కలెక్టర్ వినయ్‌చంద్‌కు లేఖ రాసిన ఆయన... సెక్షన్ 145 సీఆర్‌పీసీ అమల్లో ఉండగా మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని పేర్కొన్నారు. ఫలితంగా సంప్రదాయ మత్య్యకారులు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
ఈ క్రమంలో వారికి మరింత రక్షణగా నిలిచే ఏపీ మెరైన్ ఫిషింగ్ రెగ్యులేషన్ చట్టాన్ని అమల్లోకి తేవాలని సూచించారు. వివాదాలతో చేపలవేట ఆగిపోయిన పరిస్థితులు విశాఖలో చాలాసార్లు జరిగాయని ఈఏఎస్ శర్మ గుర్తుచేశారు. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు, బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు అధికారులు విచారణ జరపాలని కోరారు.
ఇవీ చూడండి: